డీఎస్సీ పై సిబిఐ విచారణ జరిపించాలని
లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి
జడ్పీ చైర్ పర్సన్ ఆన అరుణమ్మ
భారీ ర్యాలీ నిర్వహించిన విడవలూరు, కొడవలు మండలాల వైసీపీ నేతలు..
కొనసాగుతున్నమూడవరోజు రిలే నిరాహార దీక్ష
డీఎస్సీలో జరిగిన అవకతవకలకు సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నెల్లూరు జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ డిమాండ్ చేశారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలోజరుగుతున్న.మూడో రోజు వైసిపి రిలే నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. మూడవరోజు దీక్షకువిడవలూరు,కొడవలూరు మండలం వైసీపీ నాయకులు, యువత, విద్యార్థుల కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ అబద్ధపు హామీలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నల్లపరెడ్డి రజిత్ రెడ్డి, వీరి చలపతిరావు, కొండూరు అనిల్ బాబు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, నవీన్ రెడ్డి, శేషగిరిరావు, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, లీగల్ సెల్ న్యాయవాదులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
