రామ్ లీలా మైదాన్, అయ్యప్ప గ్రౌండ్ రేణుక ఎల్లమ్మ టెంపుల్ ప్రాంత సమస్యలపై చర్చ – పరిష్కారానికి కృషి చేస్తానని వారాల వినోద్ కుమార్ హామీ
కుత్బుల్లాపూర్,
రామ్ లీలా మైదాన్ కమిటీ ఆధ్వర్యంలో BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ మైదానంలోని మౌలిక సదుపాయాల గురించి కమిటీ సభ్యులతో చర్చించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బోరు సమస్య, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, అయ్యప్ప గ్రౌండ్ లో డ్రైనేజ్ వాటర్ సమస్య, UGD సమస్యలు మరియు రేణుక ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్న సమస్యలను వారాల వినోద్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యలన్నింటినీ సావధానంగా విన్న వారాల వినోద్ కుమార్ , ఈ సమస్యలన్నీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే K.P. వివేకానంద గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులతో చర్చించి శాశ్వత పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రామ్ లీలా మైదాన్ కమిటీ సభ్యులు రవి, రంగారావు, లక్ష్మణ్ మరియు ఇతర కమిటీ సభ్యులు, BRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్, కావలి రవి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
