SIR కార్యక్రమం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం*
రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో ఉన్న శ్రీ దేవి కన్వెన్షన్లో SIR కార్యక్రమం మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ దుద్దిల శ్రీధర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు *తోటకూర వజ్రెష్ యాదవ్ , జిల్లా కోఆర్డినేటర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి **ఏపీ మిథున్ రెడ్డి లతో కలిసి **కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి , మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపాతి రెడ్డి * పాల్గొన్నారు.
ఈ సందర్భంగా SIR కార్యక్రమం పురోగతి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా చేరవేసే విధానంపై విస్తృతంగా చర్చించారు. అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణ, నాయకులు మరియు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచే విధంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
