ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ వారి CSR నిధులతో నూతనంగా నిర్మించిన 2 అదనపు తరగతి గదుల భవనం ను MEO రవీందర్ రాజు తాాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు , ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు , విద్యార్థులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ అరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ వారి CSR నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన 2 అదనపు తరగతి గదులను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, పాఠశాల కు పండుగ రోజు అని , విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని వారి బంగారు భవిష్యత్తుకు పునాది లాంటిది ప్రాథమిక విద్య అని, మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో, కొత్త సొగసుల తో భవనం ను నిర్మించడం జరిగినది అని, పిల్లలకు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా నిర్మించడం జరిగినది ,CSR ప్రతినిధులు దేవుడితో సమానం అని, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అని, సామాజిక బాధ్యత గా ప్రతి ఒక్కరూ సేవ చేయాలని, పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజంకు మంచిపేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, విద్యార్థులు ఒక మంచి లక్ష్యం ఏర్పరచుకొని, మంచి క్రమ శిక్షణ, ఏకాగ్రతతో, సడలని పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగానికి ఎంతగానో కృషి చేస్తున్నారు అని, మియాపూర్ 10 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియన్ పాఠశాలకు ఇటీవలే శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, త్వరలోనే పనులు ప్రారంభించుకోవడం జరుగుతుంది అని, మరియు కొండాపూర్ మరియు చందానగర్ లో కోర్ అర్బన్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని, అన్ని ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని, ప్రవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు, తన వంతు సహాయ సహకారాలు అందిస్తాన ని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు నాగలక్ష్మి మరియు ఉపాధ్యాయులు,విద్యార్థులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
