పోచంపల్లి గ్రామంలో రూ.82 లక్షల CMC నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బహదూర్‌పల్లి 294వ డివిజన్ పరిధిలోని పోచంపల్లి గ్రామంలో ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో CMC నిధుల నుంచి రూ.82 లక్షలు మంజూరయ్యాయి.
ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.
మంజూరైన పనుల్లో సురక్ష గ్రీన్ మెడోస్ రోడ్డు అభివృద్ధికి రూ.20 లక్షలు, గాయత్రీ ఇండస్ట్రీస్ 66 నుండి హోలీ చైల్డ్ స్కూల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.15 లక్షలు, మేడ్చల్ రోడ్డు నుండి గాయత్రీ నగర్ కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.32 లక్షలు, యూజీడీ (UGD) పనులకు రూ.15 లక్షలు కేటాయించారు.
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, డివిజన్లోని ప్రతి కాలనీ, ప్రతి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులను కూడా తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ ప్రోటోకాల్ వైస్ చైర్మన్ బొంగునూరి కిశోర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మైసిగారి శ్రీనివాస్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ అమరం ముత్యం రెడ్డి, మాజీ సర్పంచ్ రామగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకర్ గౌడ్, మాజీ వార్డు సభ్యుడు తిరుపతి రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నాయకులు సదానంద్, కాలనీ నాయకులు కిషన్ రెడ్డి, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
