ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
నీట్ పేపర్ లీకేజీలో జంజీ యువత చేసిన ఉద్యమంతో దేశం ఉలిక్కి పడింది
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సైతం యువత మెగా డీఎస్సీ అక్రమాలపై కదం తొక్కాలి
ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాలి
మాజీ వైసీపీ మంత్రి, నల్లపరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని దోపిడీలు, అరాచకాలు, వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని వైసిపి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పోలిబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గురువారం కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా డీఎస్సీ అక్రమాలపై వైసీపీ రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ.ఇటీవల నీట్ పరీక్ష పత్రాల లీకేజీలో జంజి యువత చేసిన పోరాటానికి దేశం వణికిందన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ అవకతవకలపై యువత ముందుకు వచ్చి కదం తొక్కలన్నారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చంద్రబాబు గురించి ఆయన సతీమణి నారా భువనేశ్వరి చంద్రబాబు చెప్పిందే చేస్తాడు అబద్ధాలు చెప్పరు అని చెప్పారని, ఆ మాట చెప్పటమే ఒక అబద్ధం అన్నారు.2029 ఎన్నికల్లో నెల్లూరులో వైసిపి పదికి పది స్థానాలు గెలుచుకుంటుందని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని వారు తెలిపారు.
“అనంతరం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి” మాట్లాడుతూ.. తండ్రీ కొడుకులు చంద్రబాబు లోకేష్ కలిసి డీఎస్సీ ద్వారా నియమించాల్సిన టీచర్ పోస్టులను ఒక్కొక్క పోస్టు 15 నుండి 20 లక్షలు వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. లోకేష్ చెడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆయన దాచుకున్న డబ్బును కళ్ళతో చూసిన నారా లోకేష్ నేర్చుకొని దాని ప్రకారమే డీఎస్సీలో అవకతవకలకు పాల్పడ్డాడు. చంద్రబాబు నాయుడు ఆస్తి రెండు ఎకరాలు అది వారి తండ్రి ఖర్జూరపు నాయుడు ఇచ్చారని అన్నారు. కానీ ప్రస్తుతం నాలుగు లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు అందరికీ తెలుసు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి,వీరి చలపతిరావు కొండూరు అనిల్ బాబు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి శివుని నరసింహులు రెడ్డి నలుబోలు సుబ్బారెడ్డి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి అత్తిపల్లి అనూప్ రెడ్డి, గొల్లపల్లి విజయ్ కుమార్, నవీన్ రెడ్డి, షేక్. సాహుల్ సతీష్ రెడ్డి, శేషగిరిరావు, కవరగిరి శ్రీలత, యెడెం లక్ష్మీ కుమారి, కోట్ల ఉమా శ్రీనివాసరావు, జ్యోతి, పెద్ద ఎత్తున వైసిపి యువత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
