సీఎంఆర్ఎఫ్ ద్వారా మైలవరం నియోజకవర్గానికి రూ.22.88 కోట్ల ఆర్థిక సాయం.
పేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 06/07/2026.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మైలవరం నియోజకవర్గంలోని పేద ప్రజలకు వైద్య చికిత్సల కోసం రూ.22,88,06,349 ఆర్థిక సాయం మంజూరైనట్లు మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు.
ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. పేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయనిధి పూర్తి భరోసాగా నిలుస్తోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు వైద్య చికిత్సల అనంతరం రియంబర్స్మెంట్ చెక్కులు మరియు చికిత్సకు ముందుగానే ఆసుపత్రులకు నేరుగా చెల్లించే లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) రూపంలో రికార్డు స్థాయిలో నిధులు విడుదల అవుతున్నాయని పేర్కొన్నారు.
తాజాగా విడుదలైన నిధుల్లో 47 సీఎంఆర్ఎఫ్ రీయింబర్స్మెంట్ చెక్కుల ద్వారా రూ.43,60,817లు, అలాగే 96 ఎల్ఓసీల ద్వారా రూ.1,89,65,413లు మంజూరయ్యాయని తెలిపారు. మొత్తం 143 మంది లబ్ధిదారులకు రూ.2,33,26,230 ఆర్థిక సాయం అందినట్లు వెల్లడించారు.
మండలాల వారీగా విడుదలైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో మైలవరం మండలానికి అత్యధికంగా 17 చెక్కుల ద్వారా రూ.11,22,209లు, ఇబ్రహీంపట్నం మండలానికి 10 చెక్కుల ద్వారా రూ.8,54,264లు, జి.కొండూరు మండలానికి 9 చెక్కుల ద్వారా రూ.6,77,575లు, విజయవాడ రూరల్ మండలానికి 7 చెక్కుల ద్వారా రూ.14,86,337లు, రెడ్డిగూడెం మండలానికి 4 చెక్కుల ద్వారా రూ.2,20,432లు మంజూరైనట్లు వివరించారు.
పేద ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు చికిత్సకు అడ్డంకిగా మారకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన సమయంలో తన కార్యాలయం ద్వారా సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో అనేక మంది నిరుపేదలు సకాలంలో వైద్య సేవలు పొందుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
