విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలతో పాటు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం మునిసిపల్ కార్యాలయం ఎదుట వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీల్లో అక్రమాలు జరిగాయని, పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని తెలిపారు.
ఏళ్ల తరబడి కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాసిన లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, మెరిట్ జాబితాల మార్పులు, డేటా కనుమరుగవ్వడం, క్రీడల కోటా నియామకాలలో అక్రమాలు చోటుచేసుకోవడం దారుణం అని తెలియజేశారు.
విద్యాశాఖ నిర్వహణలో సంపూర్ణంగా విఫలమైన మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, 2025 డి.యస్సీ నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు, అంతే కాకుండా పీజు రియంబర్స్మెంట్ బకాయులను వెంటనే విడుదలచేసి, నిరుద్యోగభృతిని కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ మాజీ మేయరు, డిప్యూటి మేయర్లు, వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు మరియు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
