ఇన్చార్జి జిల్లా ట్రెజరీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె.రమేష్….
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిసిన ఇన్చార్జి డీటీఓ….
సాక్షిత పెద్దపల్లిజిల్లా ప్రతినిధి,
పెద్దపల్లి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సహాయ ట్రెజరీ అధికారి (ఏటీఓ)గా విధులు నిర్వహిస్తున్న కె. రమేష్‌కు ఇన్చార్జి జిల్లా ట్రెజరీ అధికారి (డీటీఓ)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించబడిన సందర్భంగా మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా ట్రెజరీ అధికారి కె. రమేష్ జిల్లా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ట్రెజరీ కార్యాలయ పనితీరు, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే విధానాలు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే అంశాలపై కలెక్టర్‌తో స్వల్పంగా చర్చించారు.
జిల్లా ట్రెజరీ కార్యాలయం ద్వారా అందించే సేవలను మరింత మెరుగుపరుస్తూ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని కె. రమేష్ ఈ సందర్భంగా తెలిపారు.
కొత్త బాధ్యతలు స్వీకరించిన కె. రమేష్‌కు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ట్రెజరీ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
