ప్రభుత్వ హాస్టళ్ల అభివృద్ధికి “విద్య… వసతి… వికాసం” కార్యక్రమం ప్రారంభం
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను అన్ని విధాలా అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన వసతి,
విద్యా వాతావరణం కల్పించే లక్ష్యంతో నెల్లూరు జిల్లాలో “విద్య… వసతి… వికాసం” కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 155 ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించనున్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఫర్నిచర్, వాషింగ్ మెషీన్లు, ఆధునిక విద్యుత్ సదుపాయాలు, నాణ్యమైన వంటశాల పరికరాలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.విద్యార్థులు పరిశుభ్రమైన,సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో నివసిస్తూ

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
