విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని దుండిగల్ డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం డి.పోచంపల్లికి నివాసులు బొంగునూరి విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహించిన నోట్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నోట్‌బుక్‌ల పంపిణీ ద్వారా విద్యార్థులకు అండగా నిలిచేందుకు బొంగునూరు విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన ఈ మంచి కార్యక్రమాన్ని అభినందించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో చదువును కొనసాగించేలా ప్రోత్సహించడంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు విద్యే పునాది అని తెలిపారు. విద్యార్థులు అంకితభావంతో చదువుకోవాలని, తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు అమరం గోపాల్ రెడ్డి, జక్కుల శ్రీనివాస్ యాదవ్, కోల సాయి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ దుండిగల్ సర్కిల్ జనరల్ సెక్రెటరీ కోల్తుర్ మల్లేష్ ముదిరాజ్, ఎక్స్ వైస్ చైర్మన్ నల్తూరి క్రిష్ణ, నాయకులు బిక్షపతి గౌడ్, ఈ శ్రీనివాస్, దార మహేష్, పలువురు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
