బోనాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ఈ నెల 9న మల్లంపేటలో ఘనంగా జరగనున్న బోనాల పండగ ఉత్సవాల ఏర్పాట్లపై, కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ బోనాల పండుగకు వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఉత్సవాలను సజావుగా మరియు సురక్షితంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. వారు సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి, ట్రాఫిక్ నిర్వహణ, వీధి దీపాలు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్యం మరియు ఇతర అవసరమైన పౌర సదుపాయాల కల్పన వంటి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు తెలిపారు.
సుమారు పదివేల మంది స్థానికులు మరియు భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, బోనాల ఉత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా అందరి మధ్య సమన్వయం అవసరమని వారు తెలిపారు. ఉత్సవాలకు ముందే పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయించాలని కమిటీ సభ్యులు తెలియజేశారు. మల్లంపేట్ బోనాల వేడుకలను ఘనంగ నిర్వహించటం లో చేయడంలో స్థానిక నాయకులు వాలంటీర్లు మరియు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కుంట్ల అమర్నాథ్, వార్డు ప్రెసిడెంట్ ఉప్పరి లక్ష్మణ్, నాయకులు మాదాస్ నవీన్, నరసింహ, కోటేష్, అరుణ్, క్రాంతి, శ్రీకాంత్, పెంటేష్, మల్లేష్, వాసవి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
