అమ్మవారి సేవలో మహిళ మంత్రులు, శాసనసభ్యులు
సాక్షిత : గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్. సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బండారు శ్రావణి గల్లా మాధవి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దర్శించుకున్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. మంత్రులు, శాసనసభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈవో సీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
