పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులో ఇద్దరికి రిమాండ్
సాక్షిత న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో
కేతేపల్లి మండలంలో రెండు ఆటోలలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేతేపల్లి ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. పగిల్ల నాగరాజు (36), తండ్రి: లేట్ యల్లయ్య, మరియు కోడూరి రాములు అలియాస్ బద్రి (50), తండ్రి: ముత్తి లింగం, ఇద్దరూ కేతేపల్లి గ్రామానికి చెందినవారు. వీరు రెండు ఆటోలలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులిద్దరినీ ఈరోజు అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం వారిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు కేతేపల్లి ఎస్‌ఐ వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
