మన పార్టీని బలోపేతనం చేసుకుందాం స్థానిక సంస్థ ఎన్నికలే లక్ష్యంగా పనిచేద్దాం
టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు కోవూరులో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు అంకితభావంతో పనిచేశాయని అభినందించారు.
అయితే ప్రక్రియ పూర్తయిందని భావించకుండా ఎన్నికల సంఘం ఇచ్చిన అదనపు గడువు 10 రోజులను సద్వినియోగం చేసుకుని లింకేజ్, మ్యాపింగ్ వంటి మిగిలిన సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన పార్టీ యూనిట్ స్థాయి సమావేశాలను ప్రస్తావిస్తూ, ప్రతి కార్యక్రమాన్ని మై టిడిపి యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. పని చేయడం ఎంత ముఖ్యమో, పార్టీకి ఆ పని కనిపించేలా యాప్లో సకాలంలో అప్లోడ్ చేయడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అవగాహన లేని వారు ఇతర నాయకుల సహాయం తీసుకుని నమోదు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో అత్యధిక శాతం అమలు చేసిందని ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం తిరిగి అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. ఒక్క కోవూరు నియోజకవర్గంలోనే సుమారు రూ.770 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.అనంతరం సమావేశానికి హాజరైన కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్వయంగా భోజనాలు వడ్డించి ఆప్యాయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి,ఇంతా మల్లారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, జెట్టి మదన్ రెడ్డి,పాలూరు వెంకటేశ్వర్లు, బీదా భాస్కరరావు, బత్తుల రమేష్, షేక్. జమీర్, షేక్. సుభాన్ భాష, పాలూరు బాలకృష్ణ, నాటక రాణి వెంకట్, నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
