అనారోగ్యంతోబాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.
కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడిముసిలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి దువ్వూరు పావని భర్త మధు రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆయనను పరామర్శించారు. మధు రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనల మేరకు చికిత్సను కొనసాగించాలని సూచించారు. ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారితో టిడిపి నాయకులు కళ్యాణ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
