శ్రీహరి ని సత్కరించిన శివుని నరసింహులు రెడ్డి
సాక్షిత : జె బి ఆర్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి. శ్రీహరి ని పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయనను చిరు సత్కారం చేస్తున్న వైస్ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ టీచరుగా, ఎంఈఓ గా, హెచ్ యం గా వారి సేవలు వెలకట్టలేనివి స్టూడెంట్స్ ని గైడ్ చేసే విధానం గాని విద్యార్థులకు విద్యను చెప్పే విధానం గాని అవలీలగా చేసే వ్యక్తి మన శ్రీహరి అని వయసు రిత్యా రిటైర్డ్ అవుతున్నాడనే గాని ఆయన మనసు ఇంకా చురుగ్గానే ఉందని వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 సిహెచ్ చెంచులక్ష్మి, ఎంఈఓ 1 ఎస్.కె ఎం డి. రహీం, జడ్పీ బాలుకున్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సోఫియా కిరణ్, మరియు జె.బి.ఆర్. స్కూల్ ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
