యోగాతోనే మానసికంగా దృఢత్వం
సాక్షిత :ప్రతి విద్యార్థి యోగాను జీవన విధానంగా మార్చుకోవాలి
ప్రధానోపాధ్యాయులు షేక్. అస్మత్ బేగం
కోవూరు శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం ఆధ్వర్యంలో పి.ఈ.టి. మాస్టర్ యస్.డి. సమీర్ సమక్షంలో విద్యార్థులకు యోగా దినోత్సవం చేయడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం 21వ తేదీ చేయవలెను కానీ కొన్ని కారణాల వల్ల ఈరోజు చేయడం జరిగిందని విద్యార్థులు యోగాను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా తమ రోజు వారి జీవితంలో భాగం చేసుకోవాలని జీవన విధానం మార్చుకోవాలని తెలిపారు. యోగా చేయడం వల్ల జీవనశైలిలో మార్పు వస్తుంది ఒత్తిడి లేని జీవితం, అలసట, నెగిటివ్ థింగ్స్, అన్ని మన లోకి రాకుండా పాజిటివ్గా ఆలోచించే విధానం యోగా వల్ల సాధ్యమని మీ చదువుకు ఎంతో సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్. ప్రశాంత్, ప్రైమరీ ఇంచార్జ్ శైలజ, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ సంధ్య, విద్యార్థులు, స్కూల్ సిబ్బంది, పాల్గొనడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
