వైసిపి ఎస్ ఐ ఆర్ పై కోవూరు టౌన్ బీఎల్ఏలకు అవగాహన సమావేశం.
సాక్షిత : కోవూరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు (బి ఎల్ ఏ) అవగాహన కల్పించేందుకు కోవూరు మండల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి,జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి,కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, జిల్లా మల్లు జయరాం రెడ్డి, ఉదయ్ భాస్కర్, బట్టేపాటి నరేంద్ర, లీగల్ టీం పర్యవేక్షకులు సేమాచార్యులు , చెంచు రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మేకల మల్లి, కావ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు.ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా, ఓటరు జాబితా ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
