కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కి నిధుల ఇవ్వండి.
…..
సాక్షిత : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికారులు మరింత శ్రద్ద పెట్టాలి ఎస్సీ, ఎస్టీ కాలనీలలో సిసి రోడ్లు, సైడ్ డ్రైన్స్,స్మశానాలు అభివృద్ధికి సహకరించండిసిఎస్ ఆర్ నిధులతో పాఠశాలల్లో వంటగదులు, బోజనశాలలు ఏర్పాటుకు సన్నాహాలు తాగునీటి పథకాల నిర్వహణకు ఆపరేటర్లు నియమించాలి జడ్పి సమావేశంలో మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా పరిషత్ నిధుల మంజూరు చేయాలని ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు..నెల్లూరులో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు..ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డిగారు, పొంగూరు నారాయణగారు, తోపాటు కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు..ఈ సందర్మంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కాలనీ లు ఎక్కువ ఉంటాయనీ, ఆయా ప్రాంతాల్లో సిసి రోడ్లు, సైడ్ డ్రైన్స్, స్మశానాలు గడిచిన 24 నెలలుగా చాలా ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.. ఇంకా చాలా వరకు చేయాల్సి ఉందన్నారు. క్లోరినేషన్ చేయడం కూడా కష్టమవుతుందన్నారు. ప్రతి పంచాయతీలో వాటర్ స్కీంలకు ఆపరేటర్లను నియమిస్తే ఉన్నటువంటి వాటర్ స్కీంలు అన్నీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు,లేకపోతే నిరుపయోగం అవుతున్నాయన్నారు. సంభందిత అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి ప్రతి పంచాయతీలో వాటర్ స్కీంలకు ఆపరేటర్లను నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ మొగిలి వెంకటేశ్వర్లు ,జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
