లారీని ఢీ కొట్టిన యువకుడు స్పాట్ లోనే మృతి
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అర్ధరాత్రి పాల్వంచ సమీపంలో లారీని ఢీకొని జరుపుల కళ్యాణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరావు కాలనీకి చెందిన కళ్యాణ్ బైక్ పై వెళుతుండగా,దమ్మపేట చౌరస్తా మలుపు తిరుగుతున్న లారీని గమనించక దాని వెనక టైర్ల కింద పడి టైర్లుకింద ఉండటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బీటెక్ పూర్తి చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్న కళ్యాణ్ పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం మహబూబాబాద్ వెళ్లడానికి స్నేహితుడి బైక్ పై వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. పాల్వంచ సెంటర్ లోని దమ్మపేట వచ్చే రోడ్ వద్ద అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో లారీను వేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై మరణించాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
