డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితమును ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలి………*
సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
25 మందిఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
*సాక్షిత వనపర్తి :
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ఉపాధ్యాయులను కోరారు
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక రేడియంట్ హై స్కూల్ లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డ్ గ్రహీత పలుస శంకర్ గౌడ్ పాల్గొని
మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన మహనీయుడు,విద్యావేత్త, తత్త్వవేత్త,మేధావి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు.రాష్ట్రపతిగా దేశానికి ఆయన ఎనలేని సేవ చేశారని కొనియాడారు.నేటి తరం ఆయనను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శంకర్ గౌడ్ అన్నారు.పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 25మంది ఉపాధ్యాయులను పాఠశాల డైరెక్టర్ దేశి రాములు యాదవ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో షఫీ,రాజేంద్రచారి,మునిస్వామి,రమేష్,మద్దిలేటి,కృష్ణవేణి, నిఖిత, సుశ్రత తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
