సీనియర్ జర్నలిస్టు ను పరామర్శించిన TSJA జర్నలిస్టులు
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: హార్ట్ సమస్యతో బాధపడుతూ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటి వద్ద బెడ్ రెస్ట్ తీసుకుంటున్న సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బొజ్జ ఎడ్వర్డ్ ను తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ TSJA నాయకులు,కమిటీ సభ్యులు ఉదయం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఎడ్వర్డ్ ను పరామర్శించిన వారిలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు దుస్సా చంద్రశేఖర్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుంటి శ్రీనివాస్ నియోజకవర్గ కమిటీ సభ్యులు సందీప్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY