శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతిఏటా హైదరాబాద్లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్రను నిర్వహిస్తారు. ఈ సారి కూడా శోభయాత్రను నిర్వహించేందుకు సన్నాహలు ప్రారంభించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్సవ కమిటీ నిర్వహకులతో సమావేశం అయ్యారు. నగరంలో శ్రీరాముని శోభయాత్రలో నిర్వాహకులు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని చెప్పారు.
సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘శ్రీరామ నవమి ఉత్సవ కమిటితో సమన్వయ సమావేశం నిర్వహించాం. 16 ఏళ్లుగా శోభయాత్ర సమర్థవంతగా, విజయవంతంగా జరుగుతుంది. ఈ సారి కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం. అందరి సహకారంతో ఈ యాత్రను ప్రశాంతంగా సాగేల ఏర్పాట్లు చేస్తున్నాం. శోభాయాత్ర కమిటీ కొన్ని విషయాలను మా ముందు ఉంచారు.. వాటిని పరిశీలిస్తాం’ అని ఆయన వెల్లడించారు.
‘అలానే ప్రభుత్వ, పోలీస్ శాఖ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. శోభాయాత్రకు సుమారుగా 3000 మంది పోలీసులు భద్రత విధుల్లో ఉంటారు. చైన్ స్నాచింగ్, ఇతర ఘటనలు జరగకుండా క్రైమ్ టీమ్స్ ను, షీ టీంలను మోహరిస్తాం. శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లతో పర్యవేక్షిస్తాము . ఈ యాత్ర సాగే మార్గాలు సీసీ టీవీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిరంతర నిఘాని కొనసాగిస్తాం. గతేడాది వెహికల్ బ్రేక్డౌన్ కారణంగా శోభాయాత్ర నెమ్మదించింది. ఈసారి అలాంటి సమస్యలు లేకుండా శోభాయాత్రను అనుకున్న సమయానికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం’ అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
