విడవలూరులోని వావిల్ల రోడ్ లో ధాన్యం సేకరణను ఆకస్మిక పరిశీలన చేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
రైతులు, మిల్లర్లతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
నెల్లూరు జిల్లా రైతులకు లారీలు మరియు ధాన్యం కొలతలకు సంబంధించి గోన సంచులు కొరత లేకుండా చూడాలి.రైతులకు అధికారులు మరియు నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలి.రైస్ మిల్లర్లకు, రైతులకు మధ్య వారధిగా సొసైటీలు, అధికారులు పనిచేయాలి. నాయకులు సమన్వయం చేసేలా చూడాలి.ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో రైతులు తెలిపిన సమస్యలపై జేసీతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ .వెంటనే రైతులకు అవసరమైన చర్యలు తీసుకొని అవసర నిమిత్తం ఏర్పాటు చేయాల్సిందిగా జెసి ని కోరారు.రైతులకు కావాల్సిన గోని సంచులు ఏర్పాటు చేయాలని, అలాకాకుండా రైస్ మిల్లర్లు ఏవైనా అవకతవకులకు పాల్పడితే తనకు వెంటనే కంప్లైంట్ చేయాలని ఎమ్మెల్యే రైతులకు, సొసైటీ మరియు అధికారులను కోరారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
