కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నల్లమల్లీస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి నల్లమల్లీస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిలుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కొలన్ హన్మంత్ రెడ్డి హాజరయ్యారు . హన్మంతన్న మాట్లాడుతూ … మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో జోనల్ చైర్ పర్సన్ , ఫౌండర్& ఛైర్పర్సన్ నల్లమల్లి జయలక్ష్మి (రాధ), ఉపాధ్యక్షులు జిల్లా శ్రీదేవి, కల్చరల్ కమిటీ ఛైర్పర్సన్ దేవరశెట్టి శ్రావంతి , ట్రస్ట్ సభ్యులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY