అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల పట్ల ప్రజలు… మోసపోవద్దు…..
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పెద్దపల్లి నందు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు జిల్లా కలెక్టర్, పెద్దపల్లి నేతృత్వంలో, వారధి సొసైటీ ద్వారా మాత్రమే నిర్వహించబడతాయి. కావున ఉద్యోగం కావాలనుకునే ఆశావహులు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న వారధి సొసైటీలో నమోదు చేసుకోవచ్చు.
మధ్యవర్తులు, దళారులు చెప్పే మాటలకు మోసపోవద్దు. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగితే నమ్మకండి. అదేవిధంగా మా జిల్లా ఆసుపత్రి పెద్దపల్లి సర్వదా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మేము, మా సిబ్బంది ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటాము అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY