అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి….
-పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య….
సాక్షిత పెద్దపల్లి :
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య* అన్నారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య తో పాటు పాలనాధికారి బి.ప్రకాష్ కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
సుల్తానాబాద్ పట్టణం చెందిన గెల్లు కేతమ్మ వృధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పీడీ డీఆర్డిఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య తెలిపారు.
అంతర్గం గ్రామానికి చెందిన కొంకటి స్వరూప గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం కుట్టించే టెండర్ ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా విద్యా శాఖ అధికారికి రాస్తూ పరిశీలించాలని తెలిపారు.
ఎలిగేడు మండలం శివపల్లి గ్రామానికి చెందిన తాండ్ర సుమన్ గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఎలాంటి పన్ను లు చెల్లించకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్రింద ఫంక్షన్ హాల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేయగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారి గంగయ్య తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY