గాజులరామారం డివిజన్ పరిధిలో గల శ్రీశ్రీశ్రీ కోటగుట్ట పెద్దమ్మతల్లి బోనాలు మరియు జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న *కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని గాజులరామారం డివిజన్ పరిధిలోని చింతల్ చెరువు వద్ద వెలిసిన కోట గుట్ట శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి బోనాలు మరియు జాతర మహోత్సవం కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ హాజరయ్యి పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు…..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కోటగుట్ట పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కృపా కటాక్షాలు, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు…
అనంతరం రోడా మేస్త్రి నగర్ డివిజన్ పరిధిలో గల (శ్రీరామ్ నగర్) లో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ కళ్యాణం సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు…
అనంతరం అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని శాలువాతో సత్కరించి ఆ అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు…
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY