ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో కొరియా ASEZ WAO సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ క్లీనప్ యాక్టివిటీ( Clean up activity) కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఎల్లమ్మబండ ప్రాంతంలో ASEZ — దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థకు చెందిన విద్యార్థి స్వచ్ఛంద సేవా విభాగం ఆధ్వర్యంలో ఎల్లమ్మబండ ప్రాంతంలో భారీ ఎత్తున భారీ క్లీనప్ యాక్టివిటీ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని, ఈ క్లీనింగ్ యాక్టివిటీ లో సుమారు 150 మంది యువ ప్రొఫెషనల్స్, వర్కర్లు, కమ్యూనిటీ సభ్యులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, సుస్థిరమైన పర్యావరణ అలవాట్లను ప్రోత్సహించడం జరిగినది అని, ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు కోసం యువత ముందుండి నడవాలని పిలుపునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని , ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సమాజ హితం పాటుపడాలని, మనం నివసిస్తున్న ప్రాంతం ను ప్లాస్టిక్ రహిత ప్రాంతం గా మార్చడానికి ప్రతి ఒక్కరికి అవగహన కల్పించాలని, ప్లాస్టిక్ వాడకం ను తగ్గించాలని,ప్రత్యామ్నాయ వనరుల మీద ఆధారపడలని , ప్లాస్టిక్ రక్కసి ని పారదోళలని , ప్రజలలో విస్తృత అవగహన కల్పించాలని, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు, యువతకు, ప్రజలకు అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వాడకం ను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
పర్యావరణ ప్రయత్నాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. సింగిల్-యూస్ ప్లాస్టిక్‌లను తగ్గించడం, రీసైక్లింగ్‌ను పెంచడం ఆరోగ్యకరమైన భూమికి అత్యవసరమని వారు నొక్కి చెప్పారు. క్లీనప్ డ్రైవ్‌లో ఉత్సాహవంతమైన దృక్పథంతో పాల్గొనడంతో పాటు, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి, రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ రహిత పద్ధతులను అవలంబించాలని వారు ప్రేరేపించడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఈ ఈవెంట్ హైదరాబాద్‌లో ASEZ WAO యొక్క నిరంతర పర్యావరణ చర్యలకు బలమైన ఊపిరి పోస్తోంది, గతంలో జరిగిన విజయవంతమైన క్లీనప్‌లు, గ్రీన్ ఇనిషియేటివ్‌లపై ఆధారపడి, యువత నేతృత్వంలోని ఈ కృషి మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది అని, ఒక క్లీనప్ డ్రైవ్, ఒక చిన్న అడుగు అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో ASEZ WAO సంస్థ సభ్యులు ప్రశాంత్ (అధ్యక్షుడు), జెస్సీ (జనరల్ సెక్రటరీ), సతీష్ (మేనేజర్) మరియు తదితరులు పాల్గొన్నారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY