వాసవి ఆర్య వైశ్య సంఘం” కమిటీకి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ …
మేడ్చల్ గుండ్ల పోచంపల్లి లోని “హుమ్ టామ్” కన్వెన్షన్ నందు నిర్వహించిన వాసవి ఆర్య వైశ్య సంఘం కొంపల్లి & సుచిత్ర నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకరోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యఆతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. నా గెలుపుకు నా వెంట ఉండి నా గెలుపులో కీలకపాత్ర పోషించిన ఆర్యవైశ్య సంఘం సభ్యులకు, సంఘం అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, ఎమ్మెల్సీ బగ్గరపు దయానంద్, వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, ఐవిఎఫ్ తెలంగాణ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సంఘం అధ్యక్షులు చిట్టీమిలా శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి తోట బిక్షపతి, కోశాధికారి పడకంటి వెంకటేశం, ఎగ్జిక్యూటివ్ ఊపాధ్యక్షులు చీల రాము తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY