అమృత్ మిత్ర ఎంపికైన శ్రీ సరస్వతి మహిళా పొదుపు సంఘం సభ్యురాలు బూర్గుల అనిత….
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: రామగుండం స్వశక్తి మహిళ బూర్గుల అనిత ఈ నెల 13న. న్యూ ఢిల్లీ భారత మండపంలో నిర్వహించిన అమృత్ మిత్ర మహోత్సవ్ లో పాల్గొన్నారు. యాభయ్ తొమ్మిదవ డివిజన్ మార్గదర్శి, స్లమ్ సమాఖ్య లో భాగమైన శ్రీ సరస్వతి మహిళా పొదుపు సంఘం సభ్యురాలు బూర్గుల అనిత అమృత్ మిత్ర గా ఎంపికై, గత కొంత కాలంగా దుర్గానగర్ పార్క్ లో పనిచేస్తున్నారు.
ఈ కార్యక్తమంలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ల నుండి ఐదుగురిని నామినేట్ చేయగా అందులో రామగుండం నగర పాలక సంస్థ నుండి అనిత కు అవకాశం లభించింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY