చంద్రన్న ప్రభుత్వంలో రైతే రారాజు
రైతుల పక్షపాతి చంద్రబాబు..
పండుగ వాతావరణంలో 3వ విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదల..
నియోజకవర్గంలో రూ. 9,30,24వేలు రైతుల ఖాతాలోకి జమ..
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి
నెల్లూరు జిల్లా కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, చంద్రబాబు రైతు పక్షపాతి అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా దేవి పేటలోని పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి పొలంలో బీర కాకర విత్తనాలను నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మూడు విడతల్లో 20000 అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా అందించడం జరిగిందన్నారు. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో 16,938/ మంది రైతులకు 9 కోట్ల 30 లక్షల 24 వేల రూపాయలు మూడో విడతగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.
ధాన్యం సేకరణకు రైతులు ఇబ్బంది పడకుండా 48 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధర స్థిరత్వం ఉండేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడ్డారని, కోటమి ప్రభుత్వంలో 24 గంటలలో హమాలీలతో సహా ధాన్యం కొనుగోలు డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. కాలువలు సకాలంలో పూడిక తీసి చివరి ఆయకట్టు వరకు నీరు పారేలా చేశామన్నారు. నియోజకవర్గంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడిఏ జి అనిత, టిడిపి మండల అధ్యక్షుడు ఏ పవన్ రెడ్డి, చెంచు కిషోర్, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, పెద్ద ఎత్తున రైతులు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY