దేశంలో LPG కొరత.. కేంద్రం సంచలన ప్రకటన.. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో LPG డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది.అయితే, ఈ నిబంధన కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. నగరాల్లో పాత నిబంధనే (25 రోజులు) కొనసాగుతుందని స్పష్టం చేసింది. కొరత సాకుతో కమర్షియల్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ రంగం సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలో అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పనిచేస్తున్నాయని పేర్కొంది. సరిపడా నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డిజీల్ను సరఫరా చేస్తున్నామని వాహనాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
