కోదాడ పట్టణంలో భక్తి శ్రద్ధలతో శీతలమాత బొడ్రాయి 8వ వార్షికోత్సవం….*
సాక్షిత : ఘనంగా నాభిశిలా శీతలమాత బొడ్రాయి 8 వ వార్షికోత్సవం.
కోదాడ పట్టణంలో నాభిశిలా శీతలమాత (బొడ్రాయి) 8వ వార్షికోత్సవ వేడుకలను కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు జరిపారు.పట్టణంలోని వివిధ వార్డుల నుంచి ప్రజా ప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని జలాభిషేకాలు జరిపి ముడుపులు, కానుకలు, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి పున ప్రతిష్ట కమిటీ, రైతు కమిటీ, ముత్యాలమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY