కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లకు ఈ నెల ఆఖరి వరకు గడువు పొడిగింపు….
–ఎంపీ గడ్డం వంశీకృష్ణ జోక్యంతో రైతులకు ఊరట…
సాక్షిత పెద్దపల్లి // . కొన్ని రోజులుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ ) ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లు ఫిబ్రవరి 20వ. తేదీతో ముగుస్తాయని సమాచారం రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెన్నూర్, కొటపల్లి ప్రాంతాల్లో పత్తి అమ్మకానికి సిద్ధంగా ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశి కృష్ణ వెంటనే స్పందించి సిసిఐ సీఎండీ తో నేరుగా మాట్లాడారు. రైతుల ప్రస్తుత పరిస్థితిని వివరించి, ప్రొక్యూర్మెంట్ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన సీసీఐ అధికారులు, ఈ రోజు నుంచి మరో 7 రోజులు అంటే ఫిబ్రవరి నెల చివరి వరకు పత్తి కొనుగోళ్లకు ఎక్స్‌టెన్షన్ ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై అధికారిక ధృవీకరణ కూడా అందింది.
దీంతో రైతులకు అదనంగా ఒక వారం సమయం లభించింది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ సమస్యల పరిష్కారానికి ఎంపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తారని తెలియజేస్తున్నామని తెలిపారు.
ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
