చిలుకూరు గ్లోబస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఘనంగా సరస్వతి దేవి హోమం…
ఫిబ్రవరి 19 : (సాక్షిత)
చిలుకూరు మండల పరిధిలోని గ్లోబస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి చదువుల తల్లి సరస్వతి హోమం ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సరస్వతి విగ్రహాం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ‘ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ ఉపేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


