శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన జై మాత అసోసియేషన్ సభ్యులు
శంకర్పల్లి: ఫిబ్రవరి 19: (సాక్షిత): శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ను గురువారం జై మాత అసోసియేషన్ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మీ అందరి ప్రేమ అభిమానం సహాయంతో మున్సిపాల్టీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయడం జరిగిందని తెలిపారు. శంకర్పల్లి మున్సిపాలిటీని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆదర్శ మున్సిపాలిటీగా చేసుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జై మాతా సభ్యులు మిర్యాల రామకృష్ణ, మాశెట్టి వెంకటేష్, మాశెట్టి సంతోష్, మాశెట్టి కిరణ్, నాసన్పల్లి గోవర్ధన్ రెడ్డి, పురం రామకృష్ణ, దండు రామకృష్ణ, దండు రాఘవేందర్, దండు అమర్నాథ్, మిర్యాల నాగరాజు, మొగుడంపల్లి రవీందర్, బచ్చు సురేష్, మునిగాల వెంకటేష్, మముల లక్ష్మణ్, యాచం ప్రసాద్, కానిస్టేబుల్ లక్ష్మణ్ ఉన్నారు


