టీడీపీ కార్యకర్తకు 4లక్షల ఆర్ధిక సాయం

Sakshitha news

టీడీపీ కార్యకర్తకు 4లక్షల ఆర్ధిక సాయం

** అండగా నిలిచిన ఎంపీ దగ్గుమళ్ళ, ఎమ్మెల్యే మురళీమోహన్

సాక్షిత ప్రతినిధి – చిత్తూరు / పూతలపట్టు: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త దినకర్ కుటుంబానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత జయప్రకాశ్ చౌదరిలు అండగా నిలిచారు. నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, బాధిత కుటుంబంలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.
గత ఏడాదిలో.. పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాలెం మండలం, నలగాంపల్లి గ్రామ పంచాయతీ, నలగాంపల్లి గ్రామానికి చెందిన దినకర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఆ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, టిడిపి సీనియర్ నేత జయప్రకాశ్, బంగారు పాళెం టిడిపి మండలాధ్యక్షులు ధరణి ప్రసాద్ .. దినకరన్ కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, తెలుగు తమ్ముళ్లు.. దినకర్ భార్య బిందు, పిల్లలు , కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల రూపాయలు నగదును అందించి బాసటగా నిలిచారు.
కష్టాలలో ఉన్న బాధిత కుటుంబానికి తోడ్పాటు అందించడంతో.. దినకర్ కుటుంబం సభ్యులు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్, టిడిపి సీనియర్ నేత జయప్రకాశ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Scroll to Top