మున్సిపల్ ఎన్నికల ఫలితాల విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు కంటెస్టెంట్ కార్పోరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ ….
రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ ఢంకా మోగించిన నేపథ్యంలో షాపూర్ నగర్ లోని స్థానిక మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆదేశాల మేరకు షాపూర్ చౌరస్తా వద్ద మున్సిపల్ ఎన్నికల సంబరాలు నిర్వహించారు, ఈ సంబరాల్లో కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు, రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు…..
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతు రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు, రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో సైతం కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని తెలిపారు, ఇంతటి భారీ విజయంలో కీలకపాత్ర పోషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి ధన్యవాదాలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో స్థానిక కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….

