కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని రావి నారాయణరెడ్డి ఈస్ట్ (గాజులరామారం) శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని రావి నారాయణరెడ్డి ఈస్ట్ (గాజులరామారం) శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం దేవాలయం తృతీయ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు వరసిద్ధి వినాయక దేవాలయ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు…

  ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వరసిద్ధి వినాయకుడి కృప కటాక్షాలు అందరిపై ఉండాలని కోరారు. అనంతరం కమిటీ వారు *శ్రీనివాస్ గౌడ్ *  ని శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు,అనంతరం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో భక్తులకు వడ్డించారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్  , భాస్కర్  , మురళీకృష్ణ  , సోమేశ్  , మల్లేష్  , కోటేశ్వరరావు  , జంగారావుగారు, యాదవరావు, మన్మధరావు  మరియు ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.
Scroll to Top