రాయన్ పేట సర్పంచిగా ఎరుకలి భాగ్యలక్ష్మిని గెలిపించండి……………
—— బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
సాక్షిత వనపర్తి
రాయన్ పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరుకలి భాగ్యలక్ష్మి ఎల్లయ్య కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కొత్తకోట మండలం రాయన్ పేట గ్రామంలో భాగ్యలక్ష్మికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు.
రాయన్ పేట గ్రామాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే దత్తత తీసుకుని గతంలో ఎన్నడూ లేనంతగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు.
ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఎరుకలి భాగ్యలక్ష్మికి ఓటేసి గెలిపిస్తే ప్రతి రోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ..ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయడంతో పాటు ఎమ్మెల్యే సహకారంతో అధిక నిధులు తెచ్చి గ్రామాభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు భాస్కర్, బాలయ్య, మాజీ ఎంపీటీసీలు రాధ సురేందర్ రెడ్డి, గొల్ల దేవమ్మ, మాజీ ఉప సర్పంచులు భాస్కర్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, నాయకులు పాండురంగయ్య, నాగన్న, బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్ గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
