సూర్యాపేటలో గ్రామపంచాయతీ ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించిన రమేష్ రెడ్డి
….
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొదటి విడత నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలో 2 మండలాలు మొదటి విడతలో, మరిన్ని 2 మండలాలు రెండో విడతలో పూర్తిచేయనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించినట్లు వివరించారు.
గ్రామాల్లోని ప్రజల్లో విశేష ఉత్సాహం కనిపిస్తోందని, ప్రతి గ్రామంలో 5 నుండి 15 మంది వరకు అభ్యర్థులు పోటీకి వస్తున్నారని రమేష్ రెడ్డి తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ప్రజల ఇంటికే ప్రభుత్వ సేవలు చేరేలా పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలన తరువాత, మరోసారి రాజశేఖర్ రెడ్డి కాలం తరహాలో ప్రజలకు అనుకూలమైన, పారదర్శక పాలన ఇప్పుడు కొనసాగుతోందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు అందకపోగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి, వేగంగా పనులు కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
రైతు రుణమాఫీ, వడ్లకు బోనస్, ఉద్యోగాల భర్తీ వంటి కీలక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. నాణ్యతలేని చీరలు పంచిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన ఇందిరమ్మ చీరలు ప్రజలకు అందజేస్తోందని అన్నారు. కొన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు కూడా పోటీకి రావడాన్ని వెనుకంజ వేస్తుండటం ప్రజల మారుతున్న అభిప్రాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. అటువంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎకగ్రీవం చేయాలని ప్రజలను కోరారు. గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విజయవంతం చేయాలని పటేల్ రమేష్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
