ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వాడపల్లి వెంకన్న ప్రసాదం అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…
జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ను రాజోలు నియోజకవర్గం శివకోడులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి వారి చిత్రపటం, ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు.వాడపల్లి వెంకన్న దర్శనానికి రావాలని ఆహ్వానం పలికారు. అడిగిన వెంటనే స్పందించి వాడపల్లి వెంకన్న ఆలయానికి రావులపాలెం నుంచి ఏటిగట్టు రహదారి నిర్మాణానికి రూ.6కోట్ల నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

