ఆరుతడి పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలి

Sakshitha news

ఆరుతడి పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలి

విత్తన డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి ఆదేశం

సూర్యపేట జిల్లా/కోదాడ, సాక్షిత :

కోదాడ మండలంలోని పలు విత్తన దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తన డీలర్లతో మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఆరుతడి పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా పెసర్లు, కందులు, మినుములు, మొక్కజొన్న, నువ్వుల విత్తనాలను రైతులకు సరిపడా నిల్వ ఉంచాలని సూచించారు.
విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లు, రశీదు అందజేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విత్తనాలను విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభ…