పాఠశాల భూ పరిరక్షణకు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
– పాఠశాల స్థలాన్ని ప్రభుత్వం నోటిఫై చేయాలి: జేఏసీ డిమాండ్
ప్రగతి నగర్, : ప్రగతి నగర్ జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భూ పరిరక్షణ కోసం ZPHS – Pragathi Nagar JAC ఆధ్వర్యంలో నవంబర్ మధ్యాహ్నం 3 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆల్విన్ చౌరస్తా మీదుగా వాసవి లేఅవుట్ వరకు సాగింది. ఈ సందర్భంగా పాఠశాల స్థలాన్ని(1.06 ఎకరాలు) కాపాడాలని, పాఠశాల భూమిని ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేయాలని, పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని నినాదాలు చేశారు.
పాఠశాల స్థలంపై వస్తున్న ఆక్రమణ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, ప్రభుత్వ పాఠశాల భూమిని పూర్తి …


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST