సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం – చింతల్

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గౌడ్ చింతల్ కార్యాలయంలో సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ , పోలే శ్రీకాంత్ గుబ్బల లక్ష్మీనారాయణ , రాజ్ కుమార్ ముదిరాజ్ దుర్గా కావాలి రవి , ముదిరాజ్ తదితరులు పాల్గొని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది.

అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని నాయకులు తెలిపారు.