కందుకూరులో సింధు హాస్పిటల్ మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

Sakshitha news

కందుకూరులో సింధు హాస్పిటల్ మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభం.

ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం – మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే రాగమయి దయానంద్

వేంసూరు మండలం – కందుకూరు

వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో రాజ్యసభ సభ్యులు, హెటిరో అధినేత బండి పార్థసారథి రెడ్డి ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఎంత…