విషాదం.. గుళికలు తిని ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

Sakshitha news

విషాదం.. గుళికలు తిని ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య..!

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, నగరి మండలం కాకవేడు ఎస్టీ కాలనీలో సాయంత్రం జరిగిన విషాద ఘటన స్థానికులను కలచివేసింది. మౌనిక (15), జీవిత (17) అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో మౌనిక మృతి చెందగా, అపస్మారక స్థితిలో ఉన్న జీవిత తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నతనంలోనే తల్లులను కోల్పోయిన వీరు, ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి సెల్ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు.