అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట జిల్లా/చిలుకూరు మండలం సాక్షిత :చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి వారి పడి పూజ మహోత్సవంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వామి దీక్ష అనేది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదని, క్రమశిక్షణ, భక్తి, సహనం, సమానత్వం, సేవాభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో పయనిస్తూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, సమాజంలో ఐకమత్యం, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.…


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
